
రోజంతా బారులు.. తప్పని నిరసనలు
గజ్వేల్ పట్టణంలో రోడ్డుపై బైఠాయించిన రైతులు
వర్గల్‌లో అంబర్‌పేట వద్ద టోకెన్ల కోసం నిరసన
జిల్లాలో యూరియా ఇక్కట్లు తీరడంలేదు. రైతులు రోజంతా పడిగాపులు కాస్తున్నారు. శుక్రవారం సైతం రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. గజ్వేల్ పట్టణంలో, వర్గల్‌లో రైతులు రహదారులపై బైఠాయించి నిరసన తెలిపారు. సరిపడా యూరియా ఇవ్వకపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్గల్‌లో స్టాక్ లేకపోవడంతో టోకెన్లు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించడంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలిపారు. దుబ్బాకలోనూ రైతులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఒక్క లారీ లోడ్ రావడంతో చాలా మంది రైతులు నిరాశతో వెనుదిరిగారు. హుస్నాబాద్‌లోనూ రైతులు గంటలకొద్దీ బారులు తీరి నిరీక్షించారు.
– గజ్వేల్‌రూరల్/వర్గల్(గజ్వేల్)/దుబ్బాకటౌన్/హుస్నాబాద్:

రోజంతా బారులు.. తప్పని నిరసనలు

రోజంతా బారులు.. తప్పని నిరసనలు

రోజంతా బారులు.. తప్పని నిరసనలు