
12 గంటలకుపైగా జలదిగ్బంధంలో సిద్దిపేట
భారీ వర్షాలతో పలు కాలనీలు, గ్రామాలు నీట మునగడానికి తప్పు ఎవరిదనే చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. సిద్దిపేట, చేర్యాల, దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్ పట్టణాల్లో నాలాలు ఆక్రమణకు గురయ్యాయి. ప్రధానంగా జిల్లా కేంద్రంలో ఎక్కువగా నాలా ఆక్రమణలు, చెత్తా చెదారం, గుర్రపు డెక్కను తొలగించకపోవడమేనని తెలుస్తోంది. మరోవైపు భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కుల కన్ను చెరువులు, కుంటలు, నాలాలపై పడింది. పలువురి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల అండతో భూములన్నీ అన్యాక్రాంతమవుతున్నాయి. హైడ్రా తరహాలో వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఆక్రమణలు కట్టడి అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, సిద్దిపేట
జిల్లా కేంద్రంలో వరద ముంపు తగ్గిన తరువాత ప్రస్తుత పరిస్థితి..
ఎందుకీ ముంపు..
ఎవరిదీ తప్పు!
● నీట మునిగిన కాలనీల్లో
అవస్థలు వర్ణనాతీతం
● నాలాలు, చెరువులు,
● హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటుకు
సర్వత్రా డిమాండ్
సిద్దిపేట పట్టణంలో వర్షం కురవడంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరింది. తొగుట నుంచి వచ్చిన వరద నీరు తడ్కపల్లి, ఎన్సాన్‌పల్లి చెరువులు నిండి కోమటి చెరువుకు చేరాయి. దాదాపు 1800 క్యూసెక్కుల వరద చేరడంతో కోమటి చెరువు ఉప్పొంగింది. అవుట్ ఫ్లో కేవలం 800 క్యూసెక్కులు ఉండటంతో కాలువ నిండి చూట్టూ పక్కల ఉన్న శ్రీనగర్ కాలనీ, హరిప్రియనగర్, శ్రీనివాస నగర్‌లోని పలు ఇళ్లల్లోకి వరద చేరింది. దీంతో గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వరద ఇళ్ల మధ్యే వరద ఉంది. దీంతో దాదాపు 12 గంటల పాటు స్థానికులు ఇళ్లకే పరిమితమయ్యారు.
తడిసిన నిత్యావసర సరుకులు
సిద్దిపేట పట్టణంలో పలువురి ఇళ్లల్లోకి నీరు రావడంతో నిత్యావసర సరుకులు, వివిధ వస్తువులు తడిసి ముద్దయ్యాయి. ఇళ్లల్లో, అపార్టుమెంట్లలోకి వచ్చిన వరద నీటిని స్థానికులు ఎత్తిపోశారు. ఇళ్లన్నీ బురదమయం కావడంతో వాటర్‌తో కడిగి మట్టిని తొలగించారు. హరిప్రియానగర్ రోడ్ నంబర్ 3కు సమీపంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలోకి వరద చేరడం.. మట్టి వినాయకుడు కావడంతో బాగా తడిసింది. దీంతో రెండో రోజే విగ్రహాన్ని యువకులు నిమజ్జనం చేశారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ సెల్లార్‌లోకి వరద చేరడంతో రెండు రోజులుగా సేవలు నిలిపివేశారు. వినియోగదారులకు మరో బ్రాంచ్‌కు పంపించారు. అలాగే బజాజ్ ఎలక్ట్రానిక్స్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రత్యేకంగా జనరేటర్‌ను అద్దెకు తీసుకుని విద్యుత్ సరఫరా కల్పించుకున్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సెల్లార్‌లో వరద నీరు చేరడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సెల్లార్‌లో ఉన్న బెడ్‌లు, ఇతర సామగ్రి బురదమయం కావడంతో వాటిని శుభ్రం చేశారు.
ఆక్రమణలు ఇలా..

12 గంటలకుపైగా జలదిగ్బంధంలో సిద్దిపేట

12 గంటలకుపైగా జలదిగ్బంధంలో సిద్దిపేట