
శనిగరం.. పరవళ్లు
శనిగరం మధ్యతరహ ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదలతో నిండుకుండలా దర్శనమిస్తోంది. భారీ వర్షాలతో మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ వరదంతా ప్రాజెక్టులోకి వస్తోంది. ప్రాజెక్ట్ సామర్థ్యం టీఎంసీ కాగా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. మత్తడి పరవళ్లు తొక్కుతోంది. శుక్రవారం కలెక్టర్ ప్రాజెక్టును సందర్శించారు. మత్తడి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పర్యాటకులు, స్థానికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జల దృశ్యాలను తన ఫోన్‌లో చిత్రీకరించారు. – కోహెడరూరల్(హుస్నాబాద్)