
పరమాత్ముని సేవలోనే తృప్తి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటే అక్కడ సంతోషాలే ఉంటాయని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణ సుందర సత్సంగంలో కొనసాగుతున్న కృష్ణాష్టమి వేడకల్లో ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ పరమాత్ముని సేవలో ఉన్న తృప్తి దేనిలో ఉండదన్నారు. శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ దుఖం ఉండదని, బాధలు తొలగుతాయన్నారు. కృష్ణుని దీవెనలతో అందరికీ మంచే జరుగాలని, ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, ఆలయ నిర్వహకులు పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ మంజుల
సిద్దిపేటజోన్: హరిత సిద్దిపేట దిశగా అందరం అడుగేద్దామని మున్సిపల్ చైర్‌పర్సన్ మంజుల సూచించారు. ఆదివారం స్థానిక 24 వార్డులో స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఆమె మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటామని, వాటిని కాపాడే బాధ్యత అందరిపై ఉందన్నారు. చెట్ల ప్రాధాన్యత గుర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు. వార్డు మహిళలు పాల్గొన్నారు.
డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం
సిద్దిపేటరూరల్: యువత డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలని రూరల్ సీఐ శ్రీను సూచించారు. జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుదామన్నారు. ఆదివారం యాంటీ డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా మండల పరిధిలోని రాఘవాపూర్ , నారాయణరావుపేట మండల కేంద్రాల్లోని యువతకు నిర్వహిస్తున్న క్రికెట్, వాలీబాల్ క్రీడలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ యువతరాన్ని డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉంచడంతో పాటు ఆటలు, మన సంస్కృతి వైపు మళ్లించేందుకే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం మన అందరి బాధ్యత అని అన్నారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిస్తే డయల్ 100 , టోల్ ఫ్రీ నెంబర్ 1908 ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో రూరల్ ఎస్‌ఐ రాజేష్, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.
నర్సారెడ్డి దిష్టి బొమ్మ దహనం
కొండపాక(గజ్వేల్): డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి దిష్టి బొమ్మను కాంగ్రెస్ నాయకులు ఆదివారం దహనం చేశారు. దుద్దెడ శివారులో రాజీవ్ రహదారిపై గల టోల్ ప్లాజా నుంచి వెలికట్ట క్రాస్ రోడ్డు వరకు దిష్టి బొమ్మను ఊరేగింపుగా తీసువచ్చి దహనం చేస్తూ నర్సారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఏర్పుల మల్లేశం, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌లు మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. నర్సారెడ్డి కోవర్టు రాజకీయాలు చేస్తూ పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
బెజ్జంకి(సిద్దిపేట): కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే యూరియా కొరత ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రత్నాకర్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే యూరియా కొరత సృష్టించారన్నారు. రైతుల ఇబ్బందులను చూస్తున్న బీజేపీ ఎంపీలు యూరియా ఎందుకు తేవడంలేదని విమర్శించారు. వెంటనే తెప్పించాలని డిమాండ్ చేశారు.

పరమాత్ముని సేవలోనే తృప్తి

పరమాత్ముని సేవలోనే తృప్తి