
అప్రమత్తంగా ఉండాలి
● అఽధికారులకు కలెక్టర్ హైమావతి సూచన
● లో లెవల్ బ్రిడ్జిల సందర్శన
చిన్నకోడూరు(సిద్దిపేట): వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి సూచించారు. ఆదివారం మండల పరిధిలోని సికింద్లాపూర్‌లో లో లెవల్ బ్రిడ్జిలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాలు మరో రెండు రోజుల పాటు ఉన్నాయన్నారు. వర్షాల కురుస్తున్నందున పొంగిపొర్లుతున్న వాగులు, కుంటలు, చెరువులు, కల్వర్టుల ప్రాంతాల వద్ద ప్రజలు వెళ్లకూడదని సూచించారు. ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతారు చేసే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆమె వెంట రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.
లోలెవల్ వంతెనల వద్ద జాగ్రత్త..
కోహెడరూరల్(హుస్నాబాద్): వర్షాకాలంలో లో లెవల్ బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి సూచించారు. ఆదివారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా గుండారెడ్డిపల్లిలోని లో లెవల్ బ్రిడ్జిల వద్ద వరద ప్రవాహాన్ని ఆర్‌అండ్‌బీ వెంకటేశ్‌తో కలిసి పరిశీలించారు. అలాగే తంగళ్లపల్లిలోని పిల్లి వాగు లోలెవల్ వంతెనను పరిశీలించారు.
మోయతుమ్మెద వాగు పరిశీలన
నంగనూర్(సిద్దిపేట): కలెక్టర్ హైమావతి ఆదివారం నంగనూరు మండలం ఆక్కేనపల్లి వద్ద మోయతుమ్మెద వాగును పరిశీలించారు. అలాగే లోలెవల్ బ్రిడ్జి, బద్దిపడగ ఊర చెరువు, మత్తడి కింద రోడ్డును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి వాగు మీదగా రాకపోకలు లేకుండా చూడాలని సూచించారు.