
వ్రత వైభవం.. భక్తజన సందోహం
సుప్రసిద్ధమైన నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం ఆదివారం శ్రావణ శోభను సంతరించుకుంది. భారీగా తరలివచ్చిన భక్తజన సందోహంతో కిటకిటలాడింది. సత్యదేవుని వ్రతాలు, కల్యాణాలు, అభిషేకాది మొక్కులు తీర్చుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలాచరించారు. భక్తిశ్రద్ధలతో వ్రతాది మొక్కులు తీర్చుకుని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ యంత్రాంగం జాగ్రత్తలు తీసుకున్నది. – వర్గల్(గజ్వేల్)

వ్రత వైభవం.. భక్తజన సందోహం