
నేరాల అదుపునకు సీసీ కెమెరాలు కీలకం
మిరుదొడ్డి(దుబ్బాక): నేరాల అదుపునకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పెద్ద చెప్యాలలో గ్రామానికి చెందిన నరేశ్ సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాల ద్వారా ముందస్తు చర్యలు చేపట్టవచ్చన్నారు. సీసీ కెమెరాలు ఉన్న గ్రామాల్లో క్రైమ్ రేట్లు తగ్గుతాయన్నారు.