
మైనంపల్లి దిష్టి బొమ్మ దహనం
కొండపాక(గజ్వేల్): మండలంలోని వెలికట్ట క్రాస్‌రోడ్డులో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దిష్టి బొమ్మను దహనం చేశారు. హన్మంతరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజీవ్ రహదారిపై 20 నిమిషాల పాటు రాస్తారోకో చేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేముల బాబు మాట్లాడుతూ పార్టీ ప్రతిష్టను పెంచుతున్న డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిపై లేనిపోని అంతరాలు సృష్టించి గొడవలకు మైనంపల్లి కారణమవుతున్నారంటూ ఆరోపించారు. కులాల పేరుతో రాజకీయం చేయడం తగదన్నారు. చిల్లర రాజీకీయాలు చేయడం మానుకోవాలన్నారు. ప్రతి పక్ష పార్టీల నేతలు సొంత పార్టీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్న తరుణంలో అండగా ఉండాల్సిన మైనంపల్లి ఇలా వ్యవహరించడమేమిటన్నారు. మైనంపల్లి ప్రవర్తనలో మార్పు రావాలని, లేని పక్షంలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రమేష్, రాజశేఖర్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.