
ఇదేనా కాంగ్రెస్ మార్పు?
నంగునూరు(సిద్దిపేట): పదేళ్లుగా కనబడని రైతుల క్యూలైన్లు మళ్లీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో కనబడుతున్నాయని, ఇదేనా కాంగ్రెస్ మార్పు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. శుక్రవారం పాలమాకుల పీఏసీఎస్‌ను సందర్శించి ఎరువుల కోరతపై రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తమ ఇబ్బందులను వివరించారు. పొద్దంతా నిలబడినా ఒకటి, రెండు బస్తాలే ఇసున్నారని అన్నారు. హరీశ్‌రావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గతంలో కంటే సాగు విస్తీర్ణం తగ్గినా ఎరువుల కొరత ఎందుకు ఉందో చెప్పాలన్నారు. సబ్సిడీలను ఎత్తివేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు.
చేనేత సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తా
సిద్దిపేటజోన్: చేనేత సమస్యలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం ఇందిరానగర్ పద్మశాలి సమాజ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన స్థలంలో సొంత నిధులతో భవనం నిర్మాణం సంతోషంగా ఉందన్నారు. భవనం చుట్టూ మంచి ప్రహరీ నిర్మాణానికి తన సహకారం ఉంటుందన్నారు. పట్టణంలో చేనేత మగ్గం విగ్రహాన్ని ఏర్పాటుకు సంపూర్ణ తోడ్పాటు అందిస్తానన్నారు. కేసీఆర్ హయాంలో సిద్దిపేట అభివృద్ధిలో పరుగులు పెట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ఈ రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పిడికెడు మట్టి తీయలేదని, అంగుళం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు డాక్టర్ సతీష్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్ మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
రైతుల క్యూలైన్లు,
కాలిన మోటార్లు మళ్లీ దర్శనం
ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా