
త్యాగధనుల పుణ్యఫలం
ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్‌చంద్రబోస్
సిద్దిపేటకమాన్: ఎంతో మంది త్యాగధనుల పుణ్యఫలం, స్వాతంత్య్ర సమరయోధుల ప్రాణత్యాగంతో స్వాతంత్య్రం సిద్ధించిందని ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్‌చంద్రబోస్ అన్నారు. సిద్దిపేట పోలీసు కమిషనర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం పాలనలో మన దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో ఏసీపీ రవిందర్‌రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ సుమన్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ రవిందర్, సీఐలు పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్‌లో విష జ్వరాలు
జగదేవ్‌పూర్(గజ్వేల్): మండలంలోని తిమ్మాపూర్‌లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వారం క్రితం ఓ యువకుడికి డెంగీ రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఐదారు రోజులుగా వర్షాలు కురవడంతో గ్రామంలో చాలా మంది విషజ్వరాల బారిన పడుతున్నారు. గ్రామంలో అంతర్గత రోడ్లన్నీ బురదమాయంగా మారాయి. వర్షం నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెంది రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్లకు ఇరు వైపులా అండర్ డ్రైనేజీ లేకపోవడంతో వర్షం నీరు రోడ్లపై నిలుస్తోందన్నారు. గ్రామంలో సుమారు పది మందికి పైగా విష జ్వరాలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. కొంతమంది గజ్వేల్ పట్టణంలోని వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఎక్కువగా చిన్నారులు జ్వరాలు బారిన పడుతున్నారని ఆవేదన చెందారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించిందన్నారు. వైద్య సిబ్బంది ఇటువైపు దృష్టి సారించడంలేదని, మురికి కాల్వల వెంట, మురుగు గుంతల వద్ద బ్లీచింగ్ పౌడర్ చల్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

త్యాగధనుల పుణ్యఫలం