సంక్షేమమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

సంక్షేమమే ధ్యేయం

Aug 16 2025 8:59 AM | Updated on Aug 16 2025 8:59 AM

సంక్ష

సంక్షేమమే ధ్యేయం

సాక్షి, సిద్దిపేట: ప్రజా పాలనలలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన 79వ పంద్రాగస్టు వేడుకల్లో మంత్రి పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలో రోడ్లు, మౌలిక వసతులు కల్పించి అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచుతామన్నారు. ధనవంతులకే పరిమితమైన సన్న బియ్యం.. ప్రజా ప్రభుత్వంలో పేదలందరూ తింటున్నారన్నారు. జిల్లాలో కొత్తగా 35,681 రేషన్‌ కార్డులు మంజూరు చేసి 1.10లక్షల మంది సభ్యులను చేర్చినట్లు తెలిపారు. సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 12,633 ఇళ్లు మంజూరు కాగా 6,509 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, మరిన్ని త్వరలో పనులు ప్రారంభం కానున్నాయన్నారు.

ఉచిత ప్రయాణంతో రూ.527 కోట్ల లబ్ధి

జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కింద రూ. 527 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. రైతు భరోసా పథకం ద్వారా 9 రోజుల్లోనే రూ.355కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. 2025–26 వానాకాలంలో రూ.2.22కోట్ల సబ్సిడీతో 3,110 క్వింటాళ్ల జనుము విత్తనాలు, రూ 4.56కోట్లతో 727 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను అందించినట్లు తెలిపారు.

గృహజ్యోతితో నెలకు రూ.7.22కోట్ల లబ్ధి

గృహజ్యోతి పథకం ద్వారా 2,00,981 వినియోగదారులకు నెలకు రూ 7.22కోట్ల మేర లబ్ధి కలిగిందని మంత్రి తెలిపారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో జీపీ, అంగన్‌ వాడీ భవనాల నిర్మాణాలు జరగనున్నాయన్నారు. 2025– 26లో 14,909 మహిళా సంఘాలకు రూ.886కోట్ల రుణాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 3,077 సంఘాలకు రూ.260కోట్ల బ్యాంక్‌ లింకేజీ రుణాలను అందించామని తెలిపారు. గౌరవెల్లి ప్రధాన కాలువల పనులు 55శాతం పూర్తయ్యాన్నారు. త్వరలో హుస్నాబాద్‌కు కబడ్డీ అకాడమీని తీసుకవస్తామన్నారు. పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. సెట్విన్‌ ద్వారా నిరుద్యోగ మహి ళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులకు డైట్‌ ఛార్జీలు పెంచామని గుర్తు చేశారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్‌లు, యూనిఫాంలను ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందన్నారు. 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అభివృద్ధికి రూ 2.61కోట్లును మంజూరు చేయడం జరిగిందన్నారు.

డ్రగ్స్‌ రహిత జిల్లాగా..

గంజాయి, డ్రగ్స్‌ లాంటి మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా చేయడానికి కృషి జరుగుతోందన్నారు. వన మహోత్సవం 22.47లక్షల మొక్కలు టార్గెట్‌ కాగా ఇప్పటి వరకు 18.80లక్షల మొక్కలను నాటామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ హైమావతి, సీపీ డాక్టర్‌ అనురాధ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అభివృద్ధే లక్ష్యం

జిల్లాలో కొత్తగా 35వేల రేషన్‌ కార్డులు

పేదలందరికీ సన్న బియ్యం సొంతింటి కల సాకారం

త్వరలో హుస్నాబాద్‌కు కబడ్డీ అకాడమి

పంద్రాగస్టు వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్‌

సంక్షేమమే ధ్యేయం1
1/3

సంక్షేమమే ధ్యేయం

సంక్షేమమే ధ్యేయం2
2/3

సంక్షేమమే ధ్యేయం

సంక్షేమమే ధ్యేయం3
3/3

సంక్షేమమే ధ్యేయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement