
సరస్వతి మాతగా విజయదుర్గ
కొండపాక(గజ్వేల్): మర్పడ్గలోని విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం ఎనిదవ రోజున అమ్మవారు చదువుల తల్లి సరస్వతీ మాతగా దర్శనం ఇచ్చారు. ఉదయం నుంచి విశేష పూజలు నిర్వహించారు. మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మకు గుర్తింపు తెచ్చింది బీఆర్‌ఎస్సే
బతుకమ్మకు రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చింది బీఆర్‌ఎస్సేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మర్పడ్గలో గల విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో సోమవారం పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రపంచంలో పువ్వులను పూజించే సంస్కృతీ తెలంగాణలోనే ఉందన్నారు. తెలంగాణ ప్రజలు ఏ దేశంలో ఉన్నా బతుకమ్మ విశిష్టతలను పెంచుతున్నారన్నారు. బతుకమ్మ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, దుర్గా మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలంటూ ప్రత్యేక పూజలు చేశామన్నారు.

సరస్వతి మాతగా విజయదుర్గ