
స్థానిక సమరమే..
కోడ్ కూసె.. పోరు ఎగిసె
పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యుల్ రావడంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన నాయకులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతుండగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మాత్రం రాజకీయ పార్టీల గుర్తులతో ఎన్నికలు నిర్వహిస్తారు. దీంతో బరిలోకి దిగాలని భావిస్తున్న నేతలు ఇప్పటి నుంచే టికెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న నాయకులు దసరా పండుగల సందర్భంగా విందులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు గ్రామాల్లో మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. – సిద్దిపేటజోన్