
పూల సింగిడి.. సద్దుల సందడి
● పల్లెపల్లెనా పూల పులకింత ● ఘనంగా బతుకమ్మ వేడుకలు ● ఉత్సాహంగా ఆడిపాడిన మహిళలు
జిల్లా వ్యాప్తంగా ఎటు చూసినా పూలజాతర కనువిందు చేసింది. ఎంగిలిపూల బతుకమ్మ నుంచి ఆడిపాడిన మహిళలు, యువతులు సోమవారం సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు పూజలు చేశారు. గ్రామ కూడళ్లు, ఆలయాల వద్ద బతుకమ్మల చుట్టూ మహిళలు, యువతులు ఆడిపాడారు. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ అంటూ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. అనంతరం చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకుని సద్దులను ఆరగించారు. సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, వివిధ కాలనీలలో జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే హరీశ్‌రావు సతీమణి శ్రీనిత పాల్గొన్నారు. బతుకమ్మ ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా అన్ని శాఖల అఽధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. – ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)