
సమాజాభివృద్ధికి పాటుపడాలి
వేడుకల్లో అధికారుల డ్యాన్సులు
సిద్దిపేటరూరల్: స్వాతంత్య్రాన్ని సాధించేందుకు ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేశారని, వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ హైమావతి పిలుపునిచ్చారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్రాన్ని సాధించందేకు ఎందరో తమ జీవితాలను త్యాగం చేశారన్నారు. త్యాగదనుల ఆశయాలకు అనుగుణంగా దేశ సేవలో మనందరం కలిసికట్టుగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
చేర్యాల(సిద్దిపేట): స్వాతంత్య్ర దినోత్సవం వేళ అధికారులు డ్యాన్సులు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం వేడుకలు ముగిసిన అనంతరం సినిమా పాటలకు పురుష, మహిళాధికారులు స్టెప్పులు వేశారు. ఈ వీడియోను ఓ అధికారి తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. గౌరవప్రదంగా నిర్వహించుకునే స్వాతంత్య్ర దినోత్సవం నాడు అధికారులు చిందులు వేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టరేట్‌లో జెండా ఆవిష్కరించిన కలెక్టర్