
జేఏసీ బైక్ ర్యాలీ
చేర్యాల(సిద్దిపేట): రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ చేర్యాలలో గురువారం జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, కరపత్రాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వకుళాభరణం నర్సయ్యపంతులు మాట్లాడుతూ చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ఎనిమిదేళ్లుగా అనేక రకాల పోరాటాలు చేస్తున్నా పాలకులు స్పందించడంలేదన్నారు. ఈక్రమంలోనే ఈ నెల 25న అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి ముట్టడి కార్యక్రమం చేపడుతున్నామనారు. ప్రజలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ మేరకు మండలంలోని ముస్త్యాల, వీరన్నపేట, చుంచనకోట, కడవేర్గు, పోతిరెడ్డిపల్లి, పెద్దరాజుపేట, నాగపూరి, శబాష్ గూడెం గ్రామాల్లో బైక్‌ర్యాలీ నిర్వహించిన అఖిలపక్ష నాయకులు ఇంటింటికి జాతీయ రహదారి ముట్టడి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు బాల్‌నర్సయ్య, మల్లారెడ్డి, సంజీవులు, నారాయణరెడ్డి, రాజేందర్, నాగేశ్వర్‌రావు, కరుణాకర్, వెంకట్‌మావో, తిరుపతిరెడ్డి, మల్లేశం, ఎల్లారెడ్డి, సత్తిరెడ్డి, గురువయ్యగౌడ్, సంతోష్, కిషన్, సిద్దప్ప, పాండు, కొండయ్య, బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం, టీడీపీ, టీఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.