
ఘనంగా తిరంగా ర్యాలీ
గజ్వేల్‌రూరల్: పట్టణంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఇందిరాపార్కు చౌరస్తా నుంచి బసవేశ్వర విగ్రహం వరకు 500 మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశాన్ని అగ్రగామిగా నిలుపుతున్న ప్రధాని నరేంద్రమోదీకి అండగా నిలుద్దామని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎల్లు రాంరెడ్డి, నందన్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పట్టణ శాఖ అధ్యక్షుడు మనోహర్‌యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.