పోలీస్ కమిషనర్ అనురాధ
చిన్నకోడూరు(సిద్దిపేట): క్రమశిక్షణకు మారు పేరు పోలీస్ శాఖ అని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సీపీ అనురాధ సూచించారు. మంగళవారం చిన్నకోడూరు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్ రికార్డు, రైటర్ రూమ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. నమోదవుతున్న కేసుల విషయంలో పరిశోధన పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలపై నిఘా పటిష్టం చేయాలన్నారు. ఆమె వెంట రూరల్ సీఐ శ్రీను, ఎస్‌ఐ సైఫ్ అలీ, సిబ్బంది ఉన్నారు.
నేడు జిల్లా స్థాయి
వాలీబాల్ జట్ల ఎంపిక
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా స్థాయి వాలీబాల్ అండర్–15 బాలురు, బాలికల విభాగంలో జట్ల ఎంపిక బుధవారం సిద్దిపేటలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ కార్యదర్శి సౌందర్య తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతందని, 1, జనవరి 2010 తరువాత జన్మించిన వారు ఈ ఎంపికలకు అర్హులన్నారు. ఈ క్రీడల్లో పాల్గొనే వారు ఒరిజినల్ బోనఫైడ్ సర్టిఫికెట్‌తో హాజరుకావాలన్నారు.
సామాజిక సేవలతోనే గుర్తింపు
డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి
మిరుదొడ్డి(దుబ్బాక): సామాజిక సేవలతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం అక్బర్‌పేట –భూంపల్లి మండలం వీరారెడ్డిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సందీప్ చిల్డ్రన్స్ హాస్పిటల్ సిద్దిపేట వారి సహకారంతో స్పోర్ట్స్ యూనిఫామ్స్‌ను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్‌ను అందించడం అభినందనీయమన్నారు. అనంతనం మధ్యాహ్న భోజనం, స్కూల్ రికార్డులను పరిశీలించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ఆయన ఆరా తీశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మంచి నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓ అంజాగౌడ్, సందీప్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రతినిధి మంచాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులు
ప్రబలకుండా చర్యలు
డీఎంహెచ్‌ఓ ధనరాజ్
సిద్దిపేటకమాన్: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపడుతున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. కలెక్టరేట్‌లోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో వైద్యాధికారులతో డీఎంహెచ్‌ఓ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యాధికారులు, సిబ్బంది ప్రత్యేక ప్రణాళికతో ఆరోగ్య కార్యక్రమాల పనితీరును మెరుగుపర్చుకోవాలన్నారు. ప్రతి మంగళ, శుక్ర వారాల్లో డ్రై డే నిర్వహించాలని సూచించారు. సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని, సమయ పాలన పాటించాలని సూచించారు. ఫీవర్ సర్వే నిర్వహించాలని తెలిపారు. వ్యాధి నిరోధక టీకాలు, గర్భిణుల నమోదు, ఏఎన్‌సీ ప్రొఫైల్ చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీలు జరిగేలా దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ఆనంద్, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి