
రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత పాటించాలి
హుస్నాబాద్‌రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని క్వాలిటీ కంట్రోలర్ ఈఈ శ్రీనివాస్ అన్నారు. సోమవారం కూచనపెల్లి– మాలపల్లి బీటీ రోడ్డు, మహ్మదాపూర్‌లో సీసీ రోడ్డు పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు. ఎక్కువ కాలం ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మాణాలు చేపట్టాలని చెప్పారు. రోడ్డు పనులు చేసే సమయంలో ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ చేయాలన్నారు. వీరి వెంట పీఆర్ డీఈ మహేశ్వర్ తదితరులు ఉన్నారు.