
కేసీఆర్‌తోనే అన్నివర్గాలకు న్యాయం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కేసీఆర్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని 20వ వార్డులో బీఆర్‌ఎస్ కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారన్నారు. ప్రజల గుండెల్లో నిలిచేది గులాబీ జెండా అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు అసంతృప్తిలో ఉన్నారన్నా రు. అనంతరం అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
అన్నిదానాల్లో అన్నదానం గొప్పది
సిద్దిపేటజోన్: అమర్నాథ్, కేదారినాథ్ యాత్రలు చాలా పవిత్రమైనవని, అలాంటి ప్రాంతాల్లో యాత్రికులకు అన్నదానం చేయడం చాలా గొప్ప విషయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కొనియాడారు. 35 రోజుల పాటు అమర్నాథ్ యాత్రికులకు భోజన వసతి కల్పించిన సేవా సమి తి సభ్యులను ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఅమర్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట పేరును దశదిశలా వ్యాప్తి చేసిందని అన్నారు. అన్నదాన సేవా సమితి సొంత డబ్బుల తో దక్షిణాది యాత్రికులకు సాయంగా నిలవడం అభినందనీయమన్నారు. చిత్తశుద్ధితో ఏ పని చేసి నా విజయం చేకూరుతుందన్నారు. 2010లో సిద్దిపే ట నుంచి 45 కుటుంబాలు అమర్నాథ్ యాత్రకు వెళ్లి అక్కడ అనుభవించిన ఇబ్బందులను చూసి సేవా సమితి ఏర్పాటు అయిందన్నారు. యాత్రలో ప్రజలకు సరైన భోజనం లేక ఇబ్బందు లు పడే పరిస్థితి ఒక సేవా ప్రక్రియకు నాంది అయిందన్నారు. 21 మందితో మొదలైన సమితి నేడు 190 మందికి చేరడం సంతోషంగా ఉందన్నారు.
ఎమ్మెల్యే హరీశ్‌రావు