
మంత్రులకు క్షమాపణ చెప్పాల్సిందే
కాంగ్రెస్ నాయకుల డిమాండ్
దుబ్బాక: దళిత మంత్రులంటే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డికి చిన్నచూపు తగదని.. వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం దుబ్బాక పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి దిష్టిబొమ్మతో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక బస్టాండ్ వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేశ్, దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొంగర రవి మాట్లాడుతూ మంత్రులు దామోదర, వివేక్‌లపై ఎమ్మెల్యే అనుచిత వాఖ్యలు చేయడం దారుణమన్నారు. దళితుడిని సీఎం చేస్తానని మాటతప్పిన కేసీఆర్ బాటలోనే ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి నడుస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పకపోతే ఎక్కడా తిరగకుండా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పద్మయ్య, కూడవెల్లి ఆలయం చైర్మన్ రాజిరెడ్డి, శంకర్, యేసురెడ్డి, భరత్ తదితరులు ఉన్నారు.