
మెరుగైన వైద్య సేవలే లక్ష్యం కావాలి: కలెక్టర్
గజ్వేల్: రోగులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా వైద్యులు పనిచేయాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. ఆదివారం సాయంత్రం మండల పరిధిలోని అహ్మదీపూర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అటెండెన్స్, ఓపీ, ఫార్మా రిజిష్టర్లను పరిశీలించారు. రోగులకు సేవలందించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించేదిలేదని కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం గజ్వేల్ పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను సైతం తనిఖీ చేశారు. భోజన ప్రక్రియను పరిశీలించి విద్యార్థులకు తప్పనిసరిగా కామన్ డైట్‌ను అందించాలన్నారు. గురుకులంలో సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.