ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలతో వేడెక్కిన రాజకీయం | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలతో వేడెక్కిన రాజకీయం

Aug 10 2025 8:34 AM | Updated on Aug 10 2025 8:34 AM

ఎమ్మె

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలతో వేడెక్కిన రా

ఆదివారం శ్రీ 10 శ్రీ ఆగస్టు శ్రీ 2025
● బీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ మాటల యుద్ధం ● ఉద్రిక్తతల నేపథ్యంలోనే మంత్రి వివేక్‌ పర్యటన రద్దు

దుబ్బాక: కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య మాటల యుద్ధంతో దుబ్బాక రాజకీయం రాజుకుంటోంది. ఇరుపార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. రెండ్రోజులక్రితం మెదక్‌ సభలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్‌ మంత్రుల పనితీరుపై తీవ్రస్థాయిలో దనుమాడారు. దీనికి కౌంటర్‌గా నియోజకవర్గం కాంగ్రెస్‌ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి అంతేస్థాయిలో ధ్వజమెత్తడంతో దుబ్బాక రాజకీయం ఉప్పు నిప్పుగా మారింది. దీనికి ఆజ్యం పోసేట్లు బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఒకరిపై ఒకరు సామాజిక మాధ్యమాల్లో సైతం రాజకీయ విమర్శలు చేసుకుంటుండటంతో దుబ్బాకలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఆదివారం మంత్రి వివేక్‌ పర్యటన సైతం రద్దయింది.

ఇంటెలిజెన్స్‌ సూచన మేరకే...

ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆదివారం మంత్రి వివేక్‌ పర్యటన రద్దు అయింది. వాస్తవానికి తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక, భూంపల్లి, అక్బర్‌పేట, దౌల్తాబాద్‌ మండలాల్లో పర్యటించి లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన రేషన్‌ కార్డులను పంపిణీ చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమాల ఏర్పాట్లు సైతం అధికారులు సిద్ధం చేశారు. ఇంటెలిజెన్స్‌ అధికారుల సూచనల మేరకు శనివారం సాయంత్రం మంత్రి వివేక్‌ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదు ర్కొనేందుకు కాంగ్రెస్‌ మల్లగుల్లాలు పడుతోంది.

న్యూస్‌రీల్‌

గతంలో సైతం...

జూన్‌ 21న దుబ్బాకలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సమావేశానికి హాజరైన మంత్రి వివేక్‌ పర్యటనలో ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ప్రొటోకాల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసి మధ్యలోనే మంత్రి వివేక్‌, కలెక్టర్‌ తదితరులు వెళ్లిపోయారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే మంత్రి తాజా పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటే చేశారు. అయినప్పటికీ ఇంటెలిజెన్స్‌ సమాచారంతో మంత్రి పర్యటనను రద్దు చేసుకోవడం విశేషం. ఏదేమైనా దుబ్బాకలో బీఆర్‌ఎస్‌,కాంగ్రెస్‌ పార్టీల మధ్యన జరుగుతున్న మాటల యుద్ధం ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది.

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలతో వేడెక్కిన రా1
1/3

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలతో వేడెక్కిన రా

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలతో వేడెక్కిన రా2
2/3

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలతో వేడెక్కిన రా

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలతో వేడెక్కిన రా3
3/3

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలతో వేడెక్కిన రా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement