
పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్లు
హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు తీసుకుంటున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీదేవి శనివారం తెలిపారు. సివిల్ బ్రాంచ్‌లో మిగులు సీట్లకు విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 11న సోమవారం పాలిటెక్నిక్ కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 2025– పాలీసెట్‌కు హాజరుకాని విద్యార్థులు కూడా స్పాట్ అడ్మిషన్లకు అర్హులని తెలిపారు.
ఆర్టీసీ ‘స్పెషల్’ దోపిడీ
దుబ్బాకటౌన్: పండుగ పూట ఆర్టీసీ సంస్థ ప్రయాణీకులపై చార్జీల పిడుగు పడింది. పండుగ స్పెషలంటూ బస్సులు నడుపుతూ అదనపు చార్జి వసూల్ చేయడం ప్రారంభించింది. దీంతో పండుగ పూట ప్రయాణికులపై పెను భారం పడింది. మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తూనే అదనపు చార్జీల పేరుతో మగవారి జేబుకు చిల్లుపెట్టింది. దుబ్బాక నుంచి సిద్దిపేటకు మామూలు రోజుల్లో ఎక్స్‌ప్రెస్ బస్సుకు రూ.40 టికెట్ ఉండగా రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏకంగా రూ.70 వసూలు చేయడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. రూ.70 పెట్టిన కనీసం బస్సుల్లో సీటు దొరకపోవడం గమనార్హం. ఎక్స్‌ప్రెస్ పేరు పెట్టి గ్రామ గ్రామాన బస్సు ఆపడంతో ప్రయాణికులు విసుగు చెందారు.
రైతు బీమా
నమోదు చేసుకోవాలి
జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రైతుబీమాలో తమ పేరు నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూపరాణి స్పష్టం చేశారు. 2025 రైతు బీమా పాలసీ సంవత్సరం 14 ఆగస్టు 2025 నుంచి 13 ఆగస్టు 2026 వరకు అమలులో ఉంటుందని శనివారం మీడియాకు తెలిపారు. రైతు బీమాకు 18 ఏళ్ల కంటే ఎక్కువ, 59 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల రైతులు మాత్రమే అర్హులన్నారు. బీమా నమోదు కోసం రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్, రైతు, రైతు జీవిత భాగస్వామి ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలతో తమ వ్యవసాయ విస్తరణ అధికారులను స్వయంగా సంప్రదించాలని తెలిపారు.
యువజన కాంగ్రెస్
బలోపేతానికి కృషి చేయాలి
హుస్నాబాద్: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం 65వ భారత యువజన కాంగ్రెస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కాంతాల శివారెడ్డి మాట్లాడుతూ...యువజన కాంగ్రెస్ బలోపేతానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీనవేని రాకేశ్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శులు అఖిల్, చైతన్య, అనిల్, మండల అధ్యక్షుడు శ్రీశైలం, నాయకులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ల అమలుకు చట్టం చేయండి: సీపీఎం
దుబ్బాకటౌన్: రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించేలా కేంద్రం చట్టం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొడ్డుబర్ల భాస్కర్ పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటూ శనివారం దుబ్బాక బస్టాండ్‌లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీసీలకు 42% రిజర్వేషన్లు అమలయ్యేలా కేంద్రంపై బీజేపీ ఎంపీలు ఒత్తిడి పెంచాలని కోరారు. లేకపోతే రాష్ట్రంలో బీజేపీ ఎంపీలకు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్లు