
రాఖీ..ఓ ఆత్మీయాభరణమై...
కొమురవెల్లి(సిద్దిపేట)/అక్కన్నపేట(హుస్నాబాద్)/హుస్నాబాద్: అన్నా చెల్లెల మధ్య ప్రేమ ఆప్యాయతలకు చిహ్నంగా నిలిచే రాఖీ పండుగను శనివారం జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా జరుపుకున్నారు. ప్రతీ ఇంట్లో ఆడపడుచులు తమ సోదరులకు రాఖీలు కట్టి ఆప్యాయతను చాటారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామికి హైదరాబాద్‌కు చెందిన జోగిని శ్యామల బంగారు రాఖీని సమర్పించారు.
జవాన్ విగ్రహానికి..
అక్కన్నపేట మండలం దుబ్బతండా గ్రామ పంచాయితీ పరిధిలోని రాజుతండాకు చెందిన గుగులోతు లింగయ్య, సత్తవ్వల కుమారుడైన నరసింహనాయక్ సీఆర్పీఎఫ్ జవాన్‌గా చేరి 2014లో చత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి చనిపోగా అతడి జ్ఞాపకార్థం నెలకొల్పిన విగ్రహానికి ఆ ఇంటి ఆడపడుచులు ముగ్గురూ రాఖీ కట్టారు.
పంచపాండవుల పువ్వుతో రాఖీ...
హుస్నాబాద్ పట్టణంలోని అరపల్లెకు చెందిన దొంతరబోయిన అయిలయ్య అలియాస్ కూరగాయల అయిలయ్యకు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతీ ఏడాది చెల్లెల్లు, కుమార్తెలు రాఖీలు కడతారు. అయిలయ్యకున్న పూలతోటలో విరబూసిన పంచపాండవుల పువ్వుతో రాఖీగా కట్టి తన సోదరుడిపై ఆప్యాయతను చాటుకున్నారు. దాదాపు 22 సంవత్సరాల నుంచి వీరు ఇవే పంచపాండవుల పువ్వును రాఖీగా కడుతుండటం విశేషం.

రాఖీ..ఓ ఆత్మీయాభరణమై...

రాఖీ..ఓ ఆత్మీయాభరణమై...

రాఖీ..ఓ ఆత్మీయాభరణమై...