
సోలార్‌ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు
కలెక్టర్ కె.హైమావతి
సిద్దిపేటరూరల్: జిల్లాలో సోలార్‌ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన స్థలాలు సేకరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.హైమావతి పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నవీన్‌మిట్టల్ పలువురు అధికారులతో కలిసి సోలార్ సిస్టంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...జిల్లాలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ఖాళీ ప్రభుత్వ స్థలాల వివరాలను నిర్ణీత నమూనాలో అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
నాణ్యమైన భోజనాన్ని అందించాలి
దుబ్బాకరూరల్/మిరుదొడ్డి(దుబ్బాక): మండలంలోని మహాత్మాజ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలను, అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలోని పీహెచ్‌సీని శనివారం కలెక్టర్ హైమావతి తనిఖీ చేశారు. మెనూ ప్రకారమే విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు.