
హుందాతనం అలవరుచుకో,,
కాంగ్రెస్ నేత శ్రీనివాస్‌రెడ్డికి బక్కి హితవు
దుబ్బాక: ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న శ్రీనివాస్‌రెడ్డి ముందు హుందాతనాన్ని అలవరుచుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హితవు పలికారు. తాము బాగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే తనకు కితాబునిచ్చారని...కానీ, కాంగ్రెస్ నేత శ్రీనివాస్‌రెడ్డికి తమ పనితీరు కనిపించకపోవడం దురదృష్టకరమని వెంకటయ్య వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సామాన్యుడినైన నేను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండటాన్ని శ్రీనివాస్‌రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. తనపై పనిగట్టుకుని విమర్శలు చేయడం సరికాదని చెప్పారు.