
మోదీ దిష్టి బొమ్మ దహనం
సీపీఎం ఆధ్వర్యంలో
నిరసన
చేర్యాల(సిద్దిపేట): బీహార్ ఓటర్ల జాబితా నుంచి 65లక్షల ఓట్లను తొలగించడం వెనుక బీజేపీ కుట్ర ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి అముదాల మల్లారెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద శుక్రవారం సీపీఎం మండల, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో నిరసన తెలిపి ప్రధాని మోదీ దిష్టి బొమ్మ దహనం చేశారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో ఆర్‌ఎస్‌ఎస్ మతతత్వ సిద్ధాంతాల అమలు కోసం బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో మరోసారి కుట్రకు తెరలేపిందని, ఈ కుట్ర రానున్న రోజుల్లో దేశం మొత్తం వ్యాపించే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రదానంగా బీహార్‌లో ఎస్సీ నియోజకవర్గాల్లో అధికంగా ఓట్లుతొలగించారన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంతో బడుగులకు కలుగుతున్న కొద్దిపాటి ప్రయోజనం కూడా అందకుండా చేయాలని బీజేపీ చూస్తోందన్నారు. బీజేపీ సిద్ధాంతాలతో బడుగు, బలహీన వర్గాలు ఉద్యోగ, ఆర్థిక ప్రయోజనాలకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడనుందన్నారు.