
లద్నూర్ రిజర్వాయర్‌ను నింపండి
● బీజేవైఎం రాష్ట్ర ప్రధానకార్యదర్శి సురేశ్‌గౌడ్ ● మద్దూరులో రాస్తారోకో
మద్దూరు(హుస్నాబాద్): లద్నూర్ రిజర్వాయర్‌ను నీటితో నింపి, ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్‌గౌడ్ మాట్లాడుతూ కాలువల ద్వారా చెరువులన్నింటినీ నింపి రైతులను ఆదుకోవాలన్నారు. స్థానిక పార్లమెంట్ సభ్యుడు కిరణ్ కుమార్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు రైతుల సమస్యలు పట్టడంలేదన్నారు. తహసీల్దార్ అక్కడికి వచ్చి నీటి విడుదలకు హామీ ఇవ్వడంతో వారు రాస్తారోకోను విరమించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బియ్య రమేష్, ఊట్ల రాంచంద్రారెడ్డి, సాయి కిరణ్, యాచారేణి శ్రీకాంత్, పైసా బాలకృష్ణ, మ్యాక సుదర్మ, చింతల చందు, శ్రీకాంత్, మెతుకు శివారెడ్డి, అల్డా భీరయ్య, రైతులు, తదితరులు పాల్గొన్నారు.