
చేనేతకు గౌరవం
జిల్లా కార్మికులకు కొండా లక్ష్మణ్ అవార్డులు .. 7న మంత్రి చేతుల మీదుగా ప్రదానం
సిద్దిపేటజోన్: జిల్లా చేనేత కార్మికులకు గౌరవం దక్కింది. చేనేత దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ముగ్గురు చేనేత కార్మికులను కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారక అవార్డులతో ప్రభుత్వం సత్కరించనుంది. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన అవార్డుల జాబితాలో సిద్దిపేట పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు బైరి శ్రీనివాస్ నేసిన గొల్లభామ సిల్క్, అండ్ కాటన్ చీరకు అవార్డు దక్కింది. మరో కార్మికుడు మంతురు వెంకటేశం నేసిన ముత్యం పేట సిల్క్ చీరకు అవార్డు లభించింది. అదేవిధంగా దుబ్బాక పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు జిందం రాజేశం నేసిన ఆర్ముర్ సిల్క్ చీరకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. వీరికి ఈనెల 7న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేనేత దినోత్సవం రోజున అవార్డులు ప్రదానం చేసి ఘనంగా సన్మానించనుంది.

చేనేతకు గౌరవం

చేనేతకు గౌరవం