
ఆహార శుద్ధి యంత్రాల ప్రదర్శన
హుస్నాబాద్: ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ(పీఎంఎఫ్‌ఎంఈ) పఽథకం కింద స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం ఆహార శుద్ధి యంత్రాల ప్రదర్శన నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులకు యంత్రాల పని తీరుపై అవగాహన కల్పించారు. ప్రతీ యూనిట్ రూ.1లక్ష నుంచి రూ.30 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించనున్నారు. ప్రతీ యూనిట్‌కు 35% రాయితీ అందించనున్నారు. ఆహారశుద్ధి రంగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయడం, సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ బృహత్తర పఽథకాన్ని ప్రవేశపెట్టినట్లు సంస్థల ప్రతినిధులు తెలిపారు.