లక్ష్మీనారాయణకు శ్రమశక్తి అవార్డు
దుబ్బాక పట్టణానికి చెందిన ఐఎన్‌టీయూిసీ నేత, తెలంగాణ ఆల్ బీడీ కార్మిక సంఘం నాయకుడు తుమ్మ లక్ష్మీనారాయణకు శ్రమశక్తి అవార్డు లభించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండున్నర దశాబ్దాలుగా, విద్యార్థులు, బీడీ కార్మికుల సంక్షేమం, వారి హక్కుల సాధన కోసం ఆయన అలుపెరగని కృషి చేస్తున్నారు. పేద విద్యార్థుల కోసం పనిచేస్తున్న లక్ష్మీనారాయణపై పోలీసులు గతంలో కక్షగట్టి విచక్షణ రహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో నుంచి బయటపడ్డారు. ఇప్పటికీ అతడిపై దాడిచేసిన పోలీసు అధికారులపై హైకోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో ప్రాణాలకు తెగించి కార్మికుల పక్షపాతిగా పోరాడుతున్న ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి శ్రమశక్తి అవార్డుకు ఎంపిక చేసింది. గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో అవార్డును ప్రదానం చేశారు. – దుబ్బాక


