మహిళలకు ఉచిత న్యాయ సలహాలు | - | Sakshi
Sakshi News home page

మహిళలకు ఉచిత న్యాయ సలహాలు

Published Fri, Mar 7 2025 9:22 AM | Last Updated on Fri, Mar 7 2025 9:17 AM

న్యాయమూర్తి స్వాతిరెడ్డి

హుస్నాబాద్‌: మహిళలకు ఏ సమస్య తలెత్తినా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సలహాలు పొందవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గురువారం మహిళ సంఘా ల సభ్యులకు లీగల్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేశా రు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయన్నారు. గెలిచేది ఆడ, మగ అని కాదని, నైపు ణ్యం, సమర్థత ఎవరికి ఉంటుందో వారే ఉన్నతమైన హోదాలో ఉంటారన్నారు. ఆలోచనలో మార్పు రావాలని, ఆ మార్పుకు మహిళలే తొలి అడుగు వేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌, సీడీపీఓ జయమ్మ, బార్‌ అసొసియేషన్‌ అధ్యక్షుడు మురళీమోహన్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

దరఖాస్తులు తక్షణం పరిష్కరించండి

సీపీ అనురాధ

సిద్దిపేటకమాన్‌: ఫిర్యాదు బాక్సులలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సీపీ అనురాధ సిబ్బందికి సూచించారు. పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో షీటీమ్‌, భరోసా, స్నేహిత మహిళా సెంటర్‌ సిబ్బందితో సీపీ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ గురించి పిల్లలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. పిల్లలు, మహిళల రక్షణకు మేమున్నామని పూర్తి నమ్మకం, భరోసా కల్పించాలన్నారు. హాట్‌ స్పాట్‌లపై మరింత నిఘా ఏర్పాటు చేయాలన్నారు. పిల్లలు సోషల్‌ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. హాట్‌స్పాట్‌ పరిసర ప్రాంతాల్లో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేయాలని సీఐ దుర్గకు సూచించారు. బాలికలు, అబ్బాయిలు కనబడితే వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించాలన్నారు. ఏవరైనా వేధిస్తే డయల్‌ 100 లేదా షీటీమ్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్‌ సీఐ దుర్గ, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు కిరణ్‌, శ్రీధర్‌గౌడ్‌, షీటీమ్‌, భరోసా సెంటర్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తైబజార్‌ డబ్బుల

రికవరీలో అవినీతి

రామాయంపేట(మెదక్‌): మున్సిపాలిటీలో తైబజార్‌ వేలం పాటకు సంబంధించి డబ్బుల రికవరీలో అవినీతి చోటు చేసుకుందని సీఐటీయూ, కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి, కాంగ్రెస్‌ జిల్లా నాయకులు శ్రీధర్‌రెడ్డి, రమేశ్‌ గురువారం మన్సిపల్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2018 నుంచి తాము తైబజార్‌ వేలానికి సంబంధించి వివరాల కోసం ఆర్టీఐ ద్వారా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా, తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. తైబజార్‌ వేలం పాటలో తీర్మాణించిన మేరకే సంబంధిత కాంట్రాక్టర్‌ వద్ద డబ్బులు వసూలు చేయాల్సి ఉండగా, రికార్డుల్లో మాత్రం తప్పుడు వివరాలు నమోదు చేశారని తెలిపారు. ఈవిషయమై మున్సిపల్‌ అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ప్యారానగర్‌లో సర్వేయర్ల బృందం పర్యటన

జిన్నారం(పటాన్‌చెరు): గుమ్మడిదల మండలం నల్లవల్లి సమీపంలోని ప్యారానగర్‌ గ్రామంలో సంగారెడ్డి ఏడీ ఆధ్వర్యంలో సర్వేయర్ల బృందం గురువారం పర్యటించింది. డంప్‌యార్డ్‌ ఏర్పాటుకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు వారు పర్యటించారు. అటవీ రెవెన్యూశాఖ అధికారుల సమక్షంలో సర్వే చేసి హద్దులు గుర్తించారు. సర్వే రిపోర్టును ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు అధికారుల బృందం వెల్లడించింది. కాగా ప్యారానగర్‌లో డంప్‌యార్డ్‌ ఏర్పాటును నిరసిస్తూ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు గురువారం 30వ రోజుకు చేరుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement