ప్రయివేటు వాహనాలే దిక్కు | - | Sakshi
Sakshi News home page

ప్రయివేటు వాహనాలే దిక్కు

Published Tue, Mar 4 2025 7:11 AM | Last Updated on Tue, Mar 4 2025 7:10 AM

23కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే

కొమురవెల్లి: మండలానికి చెందిన ఇంటర్‌ విద్యార్థులకు ముస్త్యాల మోడల్‌ స్కూల్‌లో పరీక్ష కేంద్రం కేటాయించారు. దీంతో విద్యార్థులకు దాదాపు 23 కిలో మీటర్లు దూరం ప్రయాణ భారం కానుంది. రెండు బస్సులు మారితేనే పరీక్ష కేంద్రానికి చేరుకుంటారు.

● కుకునూరుపల్లిలో ఇంటర్‌ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఆ కళాశాల విద్యార్థులకు కొండపాక, గజ్వేల్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు సుమారు 15 కిలోమీటర్లు వెళ్లాలి.

గురువన్నపేట వరకు నడిచి రావాలి

మాది కొమురవెల్లి మండలం గురువన్నపేట. ముస్త్యాల మోడల్‌ స్కూల్‌లో పరీక్ష కేంద్రం కేటాయించారు. అయినాపూర్‌ వరకు నడిచి వచ్చి చేర్యాలకు బస్సు ద్వారా చేరుకుంటాం. కానీ పరీక్ష టైమ్‌కు బస్సులు లేవు. ప్రైవేటు వాహనాలే దిక్కు. ప్రత్యేక బస్సుల ఏర్పాటకు అధికారులు చొరవ చూపాలి

– అనురూప్‌, గురువన్నపేట

బస్సు సౌకర్యం కల్పించాలని కోరాం

ఇంటర్‌ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు సమయానికి చేరుకునేలా బస్సుల సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ డీఎంలను కోరాం. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేశాం. సీసీ కెమెరా నిఘాలో పరీక్షల నిర్వహణ ఉంటుంది.

– రవీందర్‌ రెడ్డి, డీఐఈఓ

పకడ్బందీగా నిబంధనలు అమలు: సీపీ

సిద్దిపేటకమాన్‌: జిల్లాలోని ఇంటర్మీడియెట్‌ పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ నిబంధనలు అమలులో ఉంటాయని సీపీ అనురాధ తెలిపారు. ఈ నెల 5 నుంచి 25వ తేదీ వరకు నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. పరీక్షలు జరుగు సమయంలో సమీపంలోని అన్ని జిరాక్స్‌ సెంటర్లు మూసి వేసివేయాలని, కేంద్రం నుంచి 500మీటర్ల వరకు ప్రజలు గుమికూడి ఉండకూడదన్నారు. పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటుచేశామన్నారు.

జగదేవపూర్‌: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, మోడల్‌ కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు సెంటర్లలో సుమారు 838 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అయితే మండల కేంద్రానికి ప్రభుత్వ కళాశాల సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. పరీక్ష రాసే విద్యార్థులకు రవాణా కష్టాలు తప్పడం లేదు. రెండు కేంద్రాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు వాహనాలు ఆటోల ద్వారా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు తిప్పలు తప్పని పరిస్థితి. జగదేవపూర్‌ నుంచి భువనగిరి వెళ్లే ప్రతి బస్సు కళాశాల వద్ద ఆపేలా అవకాశం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.

ప్రయివేటు వాహనాలే దిక్కు1
1/4

ప్రయివేటు వాహనాలే దిక్కు

ప్రయివేటు వాహనాలే దిక్కు2
2/4

ప్రయివేటు వాహనాలే దిక్కు

ప్రయివేటు వాహనాలే దిక్కు3
3/4

ప్రయివేటు వాహనాలే దిక్కు

ప్రయివేటు వాహనాలే దిక్కు4
4/4

ప్రయివేటు వాహనాలే దిక్కు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement