డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి
దుబ్బాకటౌన్: విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. సోమవారం రాయపోల్ మండలం ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. తరగతి గదిలో పిల్లల సామర్థ్యాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. వినియోగించే కూరగాయలు, వంట పాత్రలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని భోజన కార్మికులకు సూచించారు. పాఠ్యాంశాల్లో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.