అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
హుస్నాబాద్: ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని తెలంగాణ గిరిజన గురుకుల బాలికల విద్యాలలయాన్ని (అక్కన్నపేట) ఆమె సందర్శించారు. స్టోర్ రూంలోని నిత్యావసర వస్తువులను పరిశీలించారు. విద్యార్థినులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఈ సందర్బంగా గరిమా అగర్వాల్ మాట్లాడుతూ విద్యార్థినులు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలన్నారు. విద్యపై ప్రత్యేక దృష్టి సారించి రానున్న పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.