కాంగ్రెస్‌ మోసాలను ఎండగడతాం | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ మోసాలను ఎండగడతాం

Published Tue, Apr 16 2024 6:45 AM

రైతులతో కలిసి సీఎంకు ఉత్తరాలు పంపుతున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ - Sakshi

అయ్యా.. ముఖ్యమంత్రి గారూ..
● హామీలు నెరవేర్చండి.. ● నేటికీ బోనస్‌ రాలే.. రుణమాఫీ చేయలే ● సీఎం రేవంత్‌రెడ్డికిపోస్టు కార్డుల్లో రైతుల వినతి

గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గారికి.. మా విన్నపం.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నేటికీ నెరవేర్చకపోవడంతో రాస్తున్న ఉత్తరం..

ఉత్తరం రాస్తున్న రైతు

చిన్నకోడూరు (సిద్దిపేట): కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ అన్నారు. సోమవారం చిన్నకోడూరులో రైతులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డికి ఉత్తరాలు రాశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హామీలు అమలు చేయాలని, లేని పక్షంలో సర్కారు మోసాలను ఎండగడతామన్నారు. రైతు బీమా వర్తింపజేయాలని, వరి ధాన్యానికి ఇస్తామన్న బోనస్‌ రూ.500 చెల్లించాలని, రూ.2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. నీళ్లు లేక ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు పాపయ్య, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ ఉమేష్‌ చంద్ర, రైతులు పాల్గొన్నారు.

జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ

1/1

Advertisement
 
Advertisement