
అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేస్తున్న మంత్రి పొన్నం
● రాజ్యాంగం దేశ భవిష్యత్‌కు దిక్సూచి ● మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం దేశ భవిష్యత్తుకు దిక్సూచిగా మారిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా చౌరస్తాలో విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ ఓటు హక్కు ద్వారా ఎన్నికలు జరుపుకోవాలని రాజ్యాంగంలో చేర్చిన వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. వెనుకబడిన వర్గాలకు సమ న్యాయం దక్కాలంటే రిజర్వేషన్ ప్రక్రియ ఉండాలని ఆకాంక్షించారన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్ పర్సన్ అయిలేని అనిత, టీ పీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి, వివిధ సంఘాల నాయకులు, కౌన్సిలర్లు ఉన్నారు.
తాటి, ఈత వనాల పరిశీలన
హుస్నాబాద్ పట్టణ శివారులో అగ్ని ప్రమాదానికి గురైన తాటి, ఈత వనాలను ఆదివారం మంత్రి పరిశీలించారు. ప్రమాదం జరిగిన ఘటనపై గీత కార్మికులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాటి, ఈత వనాలు కాలిపోవడంతో ఉపాధి కోల్పోయిన బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రమాదవశాత్తా లేక కుట్రపూరితమా? అనేది ఎకై ్సజ్, పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఉపాధి హామీ పథకం కింద చెట్లు పెట్టే కార్యక్రమం, నీళ్లు పోసే కార్యక్రమాన్ని చేపడతామన్నారు.