నారాయణఖేడ్: సిద్దిపేటలో గురువారం జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభ కోసం ఖేడ్ ఆర్టీసీ డిపో నుంచి 30 బస్సులను పంపుతున్నట్లు డీఎం సుబ్రహ్మణ్యం తెలిపారు. దీంతో డిపో పరిధిలోని వివిధ గ్రామాలకు నడిచే కొన్ని బస్సులు తాత్కాలికంగా అందుబాటులో ఉండక అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో గత నెలలో నిర్వహించిన తెలంగాణ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 339 మంది హాజరు కాగా, 144 మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో 42.48 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదేవిధంగా ఇంటర్మీడియెట్ పరీక్షలకు 667 మంది హాజరు కాగా, 347 మంది ఉత్తీర్ణులై 52.02 శాతం సాధించారు. పరీక్ష ఫలితాలను ఈనెల 21 నుంచి తెలంగాణ ఓపెన్ స్కూల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చని డీఈఓ రోహిణి తెలిపారు. మెమోలు ఈ నెల 30 నుంచి సంబంధిత పరీక్షా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. రీకౌంటింగ్‌కు పదో తరగతి విద్యార్థులు రూ.350, ఇంటర్మీడియెట్ విద్యార్థులు రూ.400 చెల్లించాలి. జవాబు పత్రాల ఫొటోకాపీ, రీవెరిఫికేషన్‌కు పదో తరగతికి రూ.1,200, ఇంటర్మీడియెట్‌కు రూ.1,200 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియకు ఈ నెల 21 నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
మెదక్‌జోన్: గత కొన్ని రోజులుగా జిల్లాలో కురుస్తున్న పొగ మంచు పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు వాహనదారులకు సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతా సూచనలు పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదని చెప్పారు.
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని చందంపేట కార్యదర్శి పద్మపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌లో పంచాయతీరాజ్ కమిషనర్‌కు బుధవారం గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక అధికారుల పాలనలో నిబంధనలకు విరుద్దంగా స్థానిక ఎంఎస్‌ఎన్ రసాయన పరిశ్రమలో అదనంగా 12 బ్లాకుల నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతో పాటు గొప్యత పాటించిన అప్పటి కార్యదర్శిపై చర్యలు తీసుకోవడంతో పాటు భవన నిర్మాణాల అనుమతులు రద్దు చేయాలని కోరారు. 11 నెలల క్రితం నూతన పంచాయతీ పాలకర్గం ఏర్పడినప్పటికీ భవన నిర్మాణ అనుమతుల విషయంలో ఎలాంటి సమాచారం అందించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించారని వివరించారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా ఉన్న ఎంఎస్‌ఎన్ పరిశ్రమ అదనపు భవన నిర్మాణ అనుమతులను రద్దు చేయడంతో పాటు పరిశ్రమ విస్తరణను నిలిపివేయాలని కోరారు. కమిషనర్‌ను కలిసిన వారిలో చందంపేట వార్డు సభ్యులు రామకృష్ణ, శేరి స్వామి, నర్సింహులు, నరేశ్, భూపాల్, చిన్నస్వామి ఉన్నారు.
అల్లాదుర్గం(మెదక్): భూముల రీ సర్వే వేగవంతం చేయాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి సూచించారు. బుధవారం అల్లాదుర్గంలో సర్వేను పరిశీలించి మాట్లాడారు. రీసర్వే పూర్తయితే వంద శాతం రైతుల ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. రైతుల సమస్యలు తీర్చేందుకే ప్రభు త్వం సర్వే చేపడుతుందన్నారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలు తీరుతాయని వివరించారు. ఆమె వెంట తహసీల్దార్ మల్లయ్య, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.


