కొత్తగా 27 పీఏసీఎస్‌లు | - | Sakshi
Sakshi News home page

కొత్తగా 27 పీఏసీఎస్‌లు

Nov 19 2026 1:48 PM | Updated on Nov 19 2026 1:48 PM

ప్రస్తుతం 105 సహకార సంఘాలు

● మెదక్‌ ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు

● సిద్దిపేటలో 11, మెదక్‌లో 7,సంగారెడ్డిలో 9 ప్రాథమిక సహకార సంఘాలు

దుబ్బాక: రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఈక్రమంలోనే తాజాగా రాష్ట్రంలో కొత్తగా పీఏసీఎస్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సహకార శాఖ సిఫార్స్‌ మేరకు బుధవా రం కొత్త సహకార సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సిద్దిపేట జిల్లాలో..

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కొత్తగా 27 ప్రాథమిక సహకార సంఘాలు ఏర్పాటు కానున్నాయి. సిద్దిపేట జిల్లాలో అక్బర్‌పేట, రాయపోల్‌, అక్కన్నపేట, మజీద్‌పల్లి, పిడిచెడ్‌, సిద్దిపేట రూరల్‌, నారాయణరావుపేట, కొమురవెల్లి, దూల్మిట్ట, కుకునూరుపల్లి, మర్కూక్‌లో మొత్తం 11 కొత్త పీఎసీఎస్‌లు ఏర్పాటు అవుతున్నాయి.

అలాగే సంగారెడ్డి జిల్లాలో..

ముస్లాపూర్‌, పాల్వంచ, ఆత్మకూర్‌, తడ్కల్‌, జహీరాబాద్‌, మునిపల్లి, నిజాంపేట, నాగల్‌గిద్ద, వట్‌పల్లిలో ఏర్పాటు చేయనున్నారు.

మెదక్‌ జిల్లాలో..

బూర్గుపల్లి, గోమారం, ఎనగండ్ల, నస్కల్‌, చిలిపిచెడ్‌, మనోహరాబాద్‌, మాసాయిపేట లో కొత్తగా సహకార సంఘాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 105 సహకార సంఘాలు ఉండగా కొత్తగా మరో 27 ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో 15, సంగారెడ్డిలో 52, మెదక్‌ జిల్లాలో 38 సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సందర్భంగా కొత్తగా సహకార సంఘాలు ఏర్పాటు చేయడంపై ఆయా సంఘాల పరిధిలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement