పటాన్‌చెరు టౌన్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులకు సంగారెడ్డి జిల్లా కోర్టు జరిమా నా విధించింది. ఈ ఘటన పటాన్‌చెరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ సీఐ ప్రసాద్‌రావు వివరాల ప్రకారంఆదివారం నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో 16 మందిని పట్టుకున్నారు. వీరిని సోమవారం కోర్టులో హాజరు పర్చగా రూ. 21 వేల జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.
జాతీయస్థాయి
భగవద్గీత పోటీలకు శ్రీప్రియ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): చిన్మయ మిషన్ భగవద్గీత పోటీల్లో జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని శ్రీప్రియ ద్వితీయ స్థానంలో నిలిచి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందని నిర్వాహకులు తెలిపారు. ఇటీవల కడప జిల్లా కేంద్రంలో జరిగిన పోటీల్లో శ్రీప్రియ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు. ఈ నెల 21, 22వ తేదీల్లో మహారాష్ట్రలోని పూణేలో జరుగనున్న జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొననున్నట్లు తెలిపారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థిని..
హవేళిఘణాపూర్(మెదక్): సిద్దిపేట జిల్లాలో జరిగిన మెదక్ ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడల్లో హవేళిఘణాపూర్ జడ్పీ హైస్కూల్ విద్యార్థిని బనావత్ శైలజ ప్రతిభ కనబర్చినట్టు ఎంఈఓ మధుమోహన్ సోమవారం తెలిపారు. ఎస్‌జీఎఫ్ అండర్–17 బాలికల విభాగంలో 400 మీటర్ల ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికై ందని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయుడు కరుణాకర్, ఉపాధ్యాయులు రాజేశం, అశోక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు విద్యార్థినిని అభినందించారు.
బాలికను వేధించిన
వ్యక్తికి మూడేళ్ల జైలు
చిన్నశంకరంపేట(మెదక్): బాలికను వేధింపులకు గురి చేయడమే కాకుండా ప్రశ్నించిన ఆమె సోదరుడిపై రాయితో దాడి చేసిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ మెదక్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు తీర్పు వెల్లడించింది. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు వివరాల ప్రకారం.. చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 2024, నవంబర్‌లో ఓ బాలిక ఐకేపీ సెంటర్ వైపు వెళ్తుండగా ఆమె పట్ల నిందితుడు గొల్ల మధు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పగా, ఆమె సోదరుడు మధును ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన మధు రాయితో అతడిపై దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ నారాయణ కేసు నమోదు చేసి, సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. వాదోపవాదాలు విన్న ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు న్యాయమూర్తి నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో శిక్షపడేలా కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి..
దుబ్బాకటౌన్: మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తికి న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు బేగంపేట ఎస్‌ఐ టి.రేణుక సోమవారం తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తిని న్యాయస్థానంలో హాజరుపరచగా ఒక రోజు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గల్లంతైన వ్యక్తి
మృతదేహం లభ్యం
శివ్వంపేట(నర్సాపూర్): చేపల వేటకు చెరువులోకి దిగి గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మండల పరిధిలోని బిజ్లిపూర్ గ్రామానికి చెందిన కుక్కల రాజు(33) శనివారం సాయంత్రం చేపలు పట్టేందుకు గ్రామ శివారులోని వీరప్ప చెరువులోకి వెళ్లి గల్లంతయ్యాడు. ఆదివారం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం గాలించినా ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం మృతదేహం చెరువులో బయటకు తేలింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి వెంకటేశం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


