గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిపై పీడీ యాక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిపై పీడీ యాక్ట్‌

Nov 3 2026 8:19 AM | Updated on Nov 3 2026 8:19 AM

● అంతర్రాష్ట్ర ముఠాతో సంబంధాలు ● ఐదు కేసుల్లో నిందితుడు

● అంతర్రాష్ట్ర ముఠాతో సంబంధాలు ● ఐదు కేసుల్లో నిందితుడు

పటాన్‌చెరు టౌన్‌: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితుడు సచిన్‌ గంగారాం మారుతి చవాన్‌పై పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ రమేశ్‌ పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. నిందితుడిని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన సచిన్‌ గంగారాం చవాన్‌ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి భారీగా గంజాయిని సేకరించి వివిధ ప్రాంతాలకు తరలిస్తూ, తన అనుచరులు, వినియోగదారులకు అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. కాగా 2020 నుంచి 2026 మధ్య తెలంగాణలో మూడు, మహారాష్ట్రలో ఒకటి, కర్ణాటకలో ఒకటి చొప్పున మొత్తం ఐదు గంజాయి కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అంతర్రాష్ట్ర స్థాయిలో గంజాయి సేకరణ, రవాణా, పంపిణీ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. ప్రజారోగ్యం, శాంతిభద్రతలకు ముప్పుగా పరిణమిస్తున్న అతడి కార్యకలాపాలను అరికట్టేందుకు పీడీ యాక్ట్‌ అమలు చేసినట్లు సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement