వెంచర్‌లో క్షుద్రపూజల కలకలం | - | Sakshi
Sakshi News home page

వెంచర్‌లో క్షుద్రపూజల కలకలం

Nov 3 2026 8:19 AM | Updated on Nov 3 2026 8:19 AM

చేర్యాల(సిద్దిపేట): పట్టణ శివారులోని ఓ వెంచర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసిన ఘటన కలకలం రేపుతోంది. రోజు వారీలాగా ఉదయం వాకింగ్‌కు వెళ్లిన వాకర్స్‌ వెంచర్‌లోని ఓ ప్రదేశంలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పాటు చిన్న పందిపిల్ల ఉండటం గమనించి ఆందోళనకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వేళ ఈ చర్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెనుక కారణాలేమై ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది. వెంచర్‌లో చోటు చేసుకున్న ఈ క్షుద్ర పూజల ఘటనపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఎస్‌ఐ అపూర్వరెడ్డితో మాట్లాడగా.. తమ దృష్టికి రాలేదని, అలాంటి మూఢనమ్మకాలను నమ్మవద్దని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement