నిబంధనలు కఠినం | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు కఠినం

Nov 3 2026 8:19 AM | Updated on Nov 3 2026 8:19 AM

ప్రతీ దుకాణం దూరం పాటించాల్సిందే

రూ.500 చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు

జిల్లాలో 63 దరఖాస్తులు

హవేళిఘణాపూర్‌(మెదక్‌): దీపావళి పండుగ వేళ టపాసులు విక్రయించే దుకాణాల ఏర్పాటుకు అధికారులు నిబంధనలు కఠినతరం చేశారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి తూచా తప్పకుండా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. బాణాసంచా దుకాణం పెట్టుకునేందుకు ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌లో రూ.500 చెల్లించి మీసేవలో దరఖాస్తు చేసుకుంటే దానిని ఫైర్‌ శాఖ సిబ్బంది పరిశీలించి అనుమతి ఇవ్వన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 63 మంది ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇప్పటికే దుకాణాల ఏర్పాటుకు 63 దరఖాస్తులు రాగా, అందులో వెల్దుర్తి 1, రామాయంపేట–1, శంకరంపేట(ఆర్‌) 1, దుకాణాలకు సంబంధించిన మూడు దరఖాస్తులను రిజక్ట్‌ చేశారు. దుకాణాదారులు ఇరువైపులా మూడు మీటర్లు, ఎదురుగా ఉన్న దుకాణానికి 10మీటర్ల దూరం పాటించేలా ఫైర్‌ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. షెడ్డు ఏర్పాటు చేసుకున్న ప్రతీ దుకాణాదారుడు తమ వద్ద 200 లీటర్ల నీటి డ్రమ్ములతో పాటు ఫైర్‌సేఫ్టీ కిట్‌లు కూడా అందుబాటులో ఉండాలని సూచిస్తున్నారు. ఫైర్‌ సిబ్బంది అనుమతి పొందిన అనంతరం రెవెన్యూ, పోలీసులు దుకాణం ఏర్పాటును పర్యవేక్షించి అనుమతి ఇవ్వనున్నారు.

టపాసుల దుకాణాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి

సూచనలు పాటించాలి

దీపావళి సందర్భంగా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారు ఫైర్‌ సిబ్బంది సూచించిన నిబంధనల మేరకు దుకాణం ఏర్పాటు చేసుకోవాలి. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

– వెంకటేశ్‌, ఫైర్‌ ఆఫీసర్‌, మెదక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement