సంగారెడ్డి వైపు నుంచి వచ్చే వాహనాలు అల్మాయిపేటకు వెళ్లాలంటే సంగుపేట వరకు వెళ్లి అండర్ బ్రిడ్జి నుంచి రెండు కి.మీ వరకు తిరిగి రావాలి. కాగా అల్మాయిపేట గ్రామస్తులు దగ్గరలోని దర్గా సమీపంలో ప్రధాన రహదారికి అడ్డంగా తాత్కాలికంగా రోడ్డును ఏర్పాటు చేసుకున్నారు. అలాగే సంగుపేట గ్రామస్తులు జోగిపేటకు వెళ్లాలంటే చౌటకూరు సమీపంలో ఉన్న బ్రిడ్జి కింద నుంచి తిరిగి రావాలి. అలా వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని భావించి దర్గా ముందు ఏర్పాటు చేసుకున్న రోడ్డు ద్వారానే జాతీయ రహదారిపైకి వెళ్తున్నారు. ఇలా వెళ్లడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ప్రైవేట్‌గా ఏర్పాటు చేసుకున్న రోడ్డు వద్ద జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మృత్యువాత పడగా, కొంతమంది గాయపడ్డారు.


