అడుగంటుతున్న భూగర్భ జలాలు | - | Sakshi
Sakshi News home page

అడుగంటుతున్న భూగర్భ జలాలు

Oct 25 2026 9:32 AM | Updated on Oct 25 2026 9:32 AM

ఆదివారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

మూడు మండలాల్లో భారీగా తగ్గుముఖం సాధారణంగా 11.24 మీటర్ల లోతులో జలం నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం

ఆదివారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

ఎల్‌నినో ప్రభావంతో రోజురోజుకు భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. గతేడాది ఈ సమయానికి 4.71 మీటర్ల లోతులో నీరు లభించగా, ప్రస్తుతం 11.24 మీటర్ల లోతులోకి పడిపోయింది. ప్రతి సంవత్సరం కురిసే వర్షాలకు ౖపైపెనే ఉండే గంగమ్మ.. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఈసారి పాతాళానికి పడిపోయింది. – సంగారెడ్డి జోన్‌

జిల్లావ్యాప్తంగా సాధారణంగా 11.24 మీటర్ల లోతులో భూగర్భ జలమట్టాలు ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారుల గణాంకాల ద్వారా తెలుస్తుంది. వర్షాకాలం సీజన్‌ 4 నెలల్లో కేవలం 1.13 మీటర్ల నీటిమట్టం పెరిగింది. జూన్‌లో 12.37 మీ.లు ఉండగా సెప్టెంబర్‌ ముగిసే నాటికి 11.24 మీటర్లు ఉంది. ఆగస్టులో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కురిసిన వర్షాలకు భూగర్భ జలమట్టం పెరిగింది. జూన్‌లో 12.37మీ. లు ఉండగా జూలైలో 12.50 లోకి పడిపోయింది. ఆగస్టులో కురిసిన వర్షాలకు 11.22 మి.లు పెరిగింది. వచ్చే వర్షాకాలం సీజన్‌ నాటికి భూగర్భజలాలు ఎంత లోతుకు పడిపోతాయోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ప్రమాదకర స్థాయిలో 3 మండలాలు

జిల్లావ్యాప్తంగా 28 మండలాలు ఉండగా, మూడు మండలాల పరిధిలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు అధికారుల గణంకాలు చెబుతున్నాయి. గుమ్మడిదలలో 17.46 మీ.లు, పటాన్‌చెరులో 17.12 మీ.లు, సంగారెడ్డిలో 16.81 మీ.ల లోతులోకి భూగర్భ జలాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తుంది. దీంతో ఆయా మండలాల్లోని వారంతా సాగు, తాగునీటి అవసరాలకు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఆందోల్‌, హత్నూర, కల్హేర్‌, కంది, కంగ్టి, కోహిర్‌, మొగుడంపల్లి, పుల్‌కల్‌ మండలాల్లో కూడా భూగర్భజలాలు దారుణంగా పడిపోయాయి. మిగితా మండలాల్లో కొంతమేర పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి.

పొదుపు చేస్తేనే మేలు

నీటి లభ్యత తక్కువగా ఉండటంతో నీటి వృథాను అరికట్టి పొదుపు చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. నీటి వృథాను ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలతో పాటు నీటి సంరక్షణ పనులు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. నీటిని పొదుపు చేస్తేనే పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

నిధులు మంజూరు చేయండి

ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

జిల్లాలోని పలుచోట్ల ఇప్పటికే నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. తక్కువ వర్షపాతం నమోదై, భూగర్భ జలాలు లోపలికి పడిపోయి న ప్రాంతాల్లో నీటి కష్టాలు షురూ అయ్యాయి. సంగారెడ్డి పట్టణంలోని పలు వార్డులలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నారు. మరికొంత మంది నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వేసవిలో నీటి కష్టాలు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement