ఆక్రమణల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణల తొలగింపు

Oct 25 2026 9:26 AM | Updated on Oct 25 2026 9:26 AM

నారాయణఖేడ్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని శనివా రం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా సన్మానించి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఖేడ్‌ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు, సమస్యల పట్ల చర్చించారు. మౌలిక వస తుల కల్పన, సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్‌ పను లు పూర్తి, తాగునీటి సమస్య పరిష్కారం, రోడ్ల విస్తరణ, విద్య, వైద్య రంగాల బలోపేతం, ఉపాధి కల్ప న తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విన్నవించారు. ఈ మేరకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

సంగారెడ్డి: పట్టణంలోని ప్రధాన రహదారి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఫుట్‌పాత్‌పై ఉన్న ఆక్రమణలను శనివారం మున్సిపల్‌ అధికారులు తొలగించారు. రహదారిపై ప్రజల రాకపోకలకు, పాదాచారుల నడకకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఫుట్‌పాత్‌లు పాదాచారులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆక్రమణల తొలగింపుతో రహదారులపై ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గడంతో పాటు పాదాచారులకు సౌకర్యం కలుగుతుందని ఆశిస్తున్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement