వలసల నివారణకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

వలసల నివారణకు చెక్‌

Oct 25 2026 9:26 AM | Updated on Oct 25 2026 9:26 AM

● ముమ్మరంగా ‘వీబీజీరాంజీ’ పనులు ● నిత్యం పర్యవేక్షిస్తున్న అధికారులు ● జీపీకి 40 నుంచి 60 మందికి ఉపాధి పెరిగిన కూలీల సంఖ్య

● ముమ్మరంగా ‘వీబీజీరాంజీ’ పనులు ● నిత్యం పర్యవేక్షిస్తున్న అధికారులు ● జీపీకి 40 నుంచి 60 మందికి ఉపాధి

రాయికోడ్‌(అందోల్‌): ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయంలో నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద రైతులు, కూలీల వలసలను నివారించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ‘వీజీజీ రాంజీ’ పథకంలో పనులు కల్పిస్తున్నారు. ముందస్తు కార్యాచరణతో జిల్లా లోని 25 మండలాల్లో పనులు సాగుతున్నాయి. చేపట్టిన పనులను నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులు సిబ్బంది, కూలీలకు పథకంలోని నిబంధనలు, ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని హత్నూర, నాగిలిగిద్ద, కోహీర్‌, కొండాపూర్‌, మునిపల్లి తదితర మండలాల్లో పనులు ఊపందుకున్నాయి. మిగిలిన మండలాల్లోనూ కోరిన వారికి పనులు కల్పిస్తున్నారు. పని చేసిన ఒక్కొక్కరికి రూ.300 కూలీ చెల్లిస్తారు.

జిల్లాలోని ప్రతి పంచాయతీలో 40 మంది కూలీలకు తగ్గకుండా పనులు కల్పించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాస్థాయి అధికారుల ప్రత్యేక చొరవతో గత ఏడాది అక్టోబర్‌లో పని చేసిన కూలీల సంఖ్యతో పోలిస్తే ప్రస్తుతం 6 రేట్లు పెరిగింది. కాలువల్లో పూడికతీత, నీటి సంరక్షణ నిర్మాణాలు, పంట కుంటలు, ఇంకుడు గుంతలు తదితర పనులతో కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోరిన ప్రతి కూలీకి వీబీజీరాంజీ పథకంలో పని కల్పించేందుకు ఏర్పాట్లు చేశాం. పథకాన్ని కూలీలు సద్వినియోగం చేసుకోవాలి. వలసలను నివారించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనులు కల్పిస్తున్నాం. భూగర్భజలాల పెంపునకు ఉపయోగపడే పనులపై ప్రత్యేక దృష్టి సారించాం.

– రమేశ్‌కుమార్‌, ఏపీఓ, రాయికోడ్‌

జిల్లాలో ఇలా..

యాక్టీవ్‌ జాబ్‌ కార్డులు 1.19 లక్షలు

పనులు కొనసాగుతున్న జీపీలు 613

కూలీలు 10,465

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement