పది ఎకరాల్లో అల్లం పంట సాగు చేశా. రూ. 35 లక్షల వరకు ఖర్చు పెట్టా. మూడెకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. పైభాగంలో ఉన్న కాండం, ఆకులు పూర్తిగా మాడిపోయాయి. దీంతో భూమిలోనే పంటను వదిలేయాల్సి వచ్చింది. సుమారు రూ.9 లక్షల వరకు నష్టం వాటిల్లింది. వాతావరణం అనుకూలించకపోవడంతోనే పంటలు దెబ్బతిన్నాయి.
– వెంకట్రెడ్డి, రైతు, మాచిరెడ్డిపల్లి
అధ్యయనం చేస్తున్నారు
తెగుళ్లు పంట దిగుబడులపై ప్రభావం చూపుతున్నందున కేరళకు చెందిన శాస్త్రవేత్తలు పంట పొలా లను సదర్శించి అధ్యయ నం చేస్తున్నారు. దీనిపై డాక్యుమెంట్ చేయనున్నారు. కర్ణాటక, కేరళ, తెలంగాణలో పర్యటించి ఎంత మేర తెగుళ్ల ఉధృతి ఉంది, పంట దిగుబడులపై ఎంత మేర ప్రభావం ఉందనేది అధ్యయనం చేస్తున్నారు. తెగుళ్లు రాకముందే మందులు పిచికారీ చేసుకోవాలి.
– సునీత,
ఉద్యానశాఖ అధికారి, కోహీర్


