సంగారెడ్డి ఎడ్యుకేషన్: తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్‌మాస్టర్స్ అసోసియేషన్‌్ (టీఎస్‌జీహెచ్‌ఎంఏ) జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా సంజీవ్‌రావు, ప్రధాన కార్యదర్శిగా రవీందర్‌రెడ్డి వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. జిల్లా కోశాధికారిగా పండరి నాయక్, గౌరవ అధ్యక్షుడిగా నాగభూషణంను ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రాజగిరిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరిధర్‌గౌడ్, కోశాధికారి తుకారాం సమక్షంలో ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. హెడ్‌మాస్టర్ల సంక్షేమం, సంఘ ఐక్యత, వృత్తిపరమైన అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు.


